శ్రీధామ్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ తెల్ల బ్యాగ్‌లో బాంబు ఉందని రైల్వే పోలీసులకు వచ్చిన ఓ ఫోన్‌కాల్ కలకలం రేపింది. దిల్లీలోని హజ్రత్ నిజాముద్దిన్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును హరియాణాలోని ఓల్డ్ ఫరీదాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా ఆపారు అధికారులు. బాంబు స్క్వాడ్ బృందాలతో రైలులో తనిఖీలు నిర్వహించారు. కిందకు దిగిన ప్రయాణికుల లగేజ్ బ్యాగులలో కూడా సోదాలు చేశారు. దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి రెైలులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధరించారు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఫోన్‌కాల్ కారణంగా రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
'శ్రీధామ్ ఎక్స్‌ప్రెస్'కు బాంబు బెదిరింపు - shridham express bomb call
దిల్లీ హజ్రత్ నిజాముద్ధిన్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యప్రదేశ్ జబల్పుర్ వెళ్తున్న రైలులో బాంబు ఉందని రైల్వే పోలీసులకు వచ్చిన ఫోన్‌కాల్ కలకలం రేపింది. వెంటనే రైలును హరియాణాలోని ఓల్డ్ ఫరిదాబాద్‌లో ఆపి మూడున్నర గంటల పాటు బాంబు స్వ్కాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. చివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
'శ్రీధామ్ ఎక్స్‌ప్రెస్'కు బాంబు బెదిరింపు
నిజాముద్దిన్ రైల్వే స్టెషన్లో ఇద్దరు వ్యక్తులు.. రైలులో బాంబు పెట్టిన విషయంపై మాట్లాడుకుంటుండగా మూడో వ్యక్తి విని.. రైల్వే పోలీస్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి సమచారమిచ్చాడని అధికారిక వర్గాలు తెలిపాయి. వెంటనే రైలుని ఫరీదాబాద్‌లో ఆపినట్లు పేర్కొన్నాయి. చివరకు అది నిజం కాదని తేలింది.