తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నడనాట కరోనా ఉప్పెన- కొత్తగా 50 వేల కేసులు - రాష్ట్రాల్లో కరోనా కేసులు

కర్ణాటకలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో మరణాలు భారీగా పెరిగాయి. కేరళ సహా ఇతర రాష్ట్రాల్లో కొవిడ్​ విలయం కొనసాగుతుంది.

news coronavirus cases in states
కరోనా కేసులు

By

Published : May 5, 2021, 9:04 PM IST

మహారాష్ట్రలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఒక్కరోజే 920మంది వైరస్​తో చనిపోయారు. మరోవైపు కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 57,640 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 57 వేలమంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

వైరస్​ విలయం

కర్ణాటకలో కొవిడ్ ​కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 50,112 కేసులు నమోదయ్యాయి. 346 మంది చనిపోయారు. మరో 26,841 మంది కొవిడ్​ నుంచి బయటపడ్డారు.

ఉగ్రరూపం

కేరళలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజే 41,953 కేసులు నమోదవగా.. 58 మంది కొవిడ్​కు బలయ్యారు. 23 వేలమందికిపైగా వైరస్​ను నుంచి కోలుకున్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో మరో 23,310 మందికి వైరస్​ సోకగా.. 167 మంది మరణించారు.
  • దిల్లీలో తాజాగా 20,960 కేసులు బయటపడ్డాయి. మరో 311 మంది చనిపోయారు.
  • బంగాల్​లో మరో 18,102 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజే కేసుల్లో ఇదే అత్యధికం. ఇవాళ.. 103 మంది కరోనాకు బలయ్యారు.
  • రాజస్థాన్​లో ఒక్కరోజే 16,815 మంది కరోనా బారిన పడ్డారు. మరో 155 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో యాక్టివ్​ కేసులు సంఖ్య 2 లక్షలకు చేరువైంది.
  • మధ్యప్రదేశ్​లో కొత్తగా 12,319 మందికి పాజిటివ్​గా తేలగా.. 71 మంది చనిపోయారు.
  • గుజరాత్​లో తాజాగా 12,955 కేసులు వెలుగుచూడగా.. 133 మంది ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details