తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త జంటలకు కండోమ్​లు​ ఆ రాష్ట్రంలో కొత్త స్కీమ్​ - నవదంపత్ కిట్​

Family Planning Kits ప్రజల్లో ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అవగాహన కల్పించేందుకు ఒడిశా ప్రభుత్వం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టనుంది. నవ దంపతీ​ కిట్​ పేరుతో నూతన వధూవరులకు కండోమ్​లు, గర్భనిరోధక మాత్రలతో పాటు పలు వస్తువులను అందించనుంది.

ోOdisha govt to gift wedding kits with condoms to newlywed couples
Odisha govt to gift wedding kits with condoms to newlywed couples

By

Published : Aug 13, 2022, 10:26 PM IST

Family Planning Kits: కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు ఒడిశా ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. నూతన వధూవరులకు 'నవ దంపతీ కిట్'​ లేదా 'నాయి పహల్​ కిట్'​ పేరుతో ఓ కిట్​ను అందించనుంది. అందులో గర్భనిరోధక మాత్రలతో పాటు ఇతర వస్తువులను ఇవ్వనుంది.

కుటుంబ నియంత్రణ ప్రయోజనాల గురించి నవదంపతులకు అవగాహన కల్పించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ సహాయంతో నాయి పహల్ పథకాన్ని ఒడిశా ప్రభుత్వం.. సెప్టెంబర్ నెలలో ప్రారంభించనుంది. ఆ పథకంలో భాగంగా నూతన వధూవరులకు స్పెషల్​ కిట్లు ఇవ్వనుంది. ఆ కిట్‌లో వివాహ రిజిస్ట్రేషన్ ఫారమ్, కండోమ్‌లు, అత్యవసర గర్భనిరోధకాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులకు సంబంధించిన ఓ బుక్‌లెట్ ఉంటాయి. వాటితో పాటు ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్, తువ్వాళ్లు, దువ్వెన, నెయిల్ కట్టర్, అద్దం వంటి వస్తువులు కూడా ఉంటాయి.

అయితే ఈ కిట్‌ల పంపిణీ బాధ్యతను సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు అప్పగిస్తామని ఫ్యామిలీ ప్లానింగ్​ డైరెక్టర్​ డా.​ బిజయ్​ పాణిగ్రాహి తెలిపారు. నూతన వధూవరులకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఆశా కార్యకర్తలకు శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు.

ఇవీ చదవండి:ఆలయాల్లో పూజలు హుండీల్లో చోరీలు అడ్డంగా బుక్కైన ప్రేమజంట

లోన్​ యాప్​ వేధింపులు 2 వేల రూపాయలు ఇచ్చి 15 లక్షలు వసూలు

ABOUT THE AUTHOR

...view details