Dalit Couple News: రాజస్థాన్ జలోర్ జిల్లా నీలకంఠ్ గ్రామంలో కొత్తగా పెళ్లైన ఓ దళిత జంటను గుడిలోకి రానివ్వలేదు పూజారి. వారిని కొబ్బరికాయ కొట్టేందుకు ఆలయంలోనికి అనుమతించలేదు. దీంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి పూజారిని అరెస్టు చేశారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది.
కొత్తగా పెళ్లైన దళిత జంటను గుడిలోకి రానివ్వని పూజారి - రాజస్థాన్ దళిత జంట
కొత్తగా పెళ్లైన దళిత జంటను గుడిలోకి రానివ్వలేదు ఓ పూజారి. ఎన్నిసార్లు ప్రాధేయపడినా అనుమతించలేదు. దీంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెళ్లి పూజారిని అరెస్టు చేశారు.

Rajasthan dalit couple news: నీలకంఠ్ గ్రామంలోని తారా రామ్‌కు శనివారం వివాహం జరిగింది. అనంతరం నూతన జంట ఊరేగింపు నిర్వహించారు. ఇందులో భాగంగా పెళ్లైన తర్వాత తొలిసారి గుడిలో కొబ్బరికాయ కొట్టాలనుకున్నారు నవ దంపతులు. అయితే ఆలయ పూజారి వీరిని లోపలికి రానివ్వలేదు. గుడి బయటే కొబ్బరికాయ కొట్టాలని, లోనికి ప్రవేశం లేదని తేల్చిచెప్పాడు. తారా రామ్ ఎన్నిసార్లు ప్రాధేయపడినా అతను ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే కొంతమంది గ్రామస్థులు కూడా పూజారికి మద్దతుగా నిలిచారు. గుడిలో దళితులకు ప్రవేశం లేదని గ్రామం ఎప్పుడో నిర్ణయం తీసుకుందని, వాదనలు అనవసరం అని వారు అన్నారు. దీంతో తారా రామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజారిని ఆదివారం అరెస్టు చేశారు.