తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లైన కాసేపటికే వరుడుకి దిమ్మతిరిగే షాక్​.. ఆమె అతడని తెలిసి.. - bride turns to be man

Bride turns man: పెళ్లైన కాసేపటికే ఓ వరుడికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. అతను ప్రేమించి పెళ్లాడింది అమ్మాయి కాదని తెలిసి హృదయం ముక్కలైంది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

newly-wed-bride-turns-out-to-be-man-in-odisha
పెళ్లైన కాసేపటికే వరుడుకి దిమ్మతిరిగే షాక్​.. ఆమె అతడని తెలిసి..

By

Published : May 28, 2022, 10:22 AM IST

Updated : May 28, 2022, 10:51 AM IST

పెళ్లైన కాసేపటికే వరుడుకి దిమ్మతిరిగే షాక్​.. ఆమె అతడని తెలిసి..

Odisha Wedding: కోటి ఆశలతో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడికి క్షణాల్లోనే ఊహించని పరిస్థితి ఎదురైంది. తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నది అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసి అతడి హృదయం ముక్కలైంది. ఒడిశా భద్రక్ జిల్లా వాసుదేవ్​పుర్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాసియ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అమ్మాయి అవతారంతో మోసం చేసిన యువకుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

పెళ్లైన కాసేపటికే వరుడుకి దిమ్మతిరిగే షాక్​.. ఆమె అతడని తెలిసి..

ఏం జరిగిందంటే..?: బంగాల్ ఉత్తర 24 పరగణాలు జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీ అనే యువకుడికి.. ఒడిశా కేంద్రపఢా జిల్లాకు చెందిన మేఘన అనే అమ్మాయితో ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. 15 రోజులకే ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మే 24న జాజ్​పుర్​లోని ఛండీఖోల్​లో మేఘనను కలిశాడు అలోక్​. అనంతరం ఆమెను మేనమామ ఇంటికి తీసుకెళ్లి వారికి పరిచయం చేశాడు. వీరి పెళ్లికి కుటుంబపెద్దలు కూడా ఒప్పుకున్నారు. దీంతో వివాహం ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ అతిథి పెళ్లికూతుర్ని మేఘన అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అతని పేరు మేఘనాథ్​ అని, తమకు దగ్గరి బంధువే అని ఆ అతిథి వెల్లడించాడు. ఇది విని వరుడి కుటుంబసభ్యులు కంగుతిన్నారు. గ్రామస్థులు వెంటనే మేఘనాథ్​ను చితకబాదారు. బట్టలు చింపివేశారు. అతను అబ్బాయి అని తెలిశాక పొడవాటి జుట్టును కత్తిరించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మేఘనాథ్​ను అతని కుటుంబసభ్యులకు అప్పగించారు.

పెళ్లైన కాసేపటికే వరుడుకి దిమ్మతిరిగే షాక్​.. ఆమె అతడని తెలిసి..

ఇది చదవండి:'హాలీవుడ్​' స్టైల్లో లగ్జరీ కార్లు చోరీ.. ఒక్కనెల్లోనే 40.. ఎలా దొరికారంటే?

Last Updated : May 28, 2022, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details