దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 15,144 కేసులు నమోదయ్యాయి. మరో 181 మంది ప్రాణాలు కోల్పోయారు. 17,170 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 1,05,57,985
- క్రియాశీల కేసులు: 2,08,826
- కోలుకున్నవారు: 1,01,96,885
- మరణాలు: 1,52,274