శుభకార్యాలు జరిగే ఇళ్లల్లోకి వెళ్లి హిజ్రాలు దీవెనలు (eunuch blessing) అందించడం దేశంలో ఉన్న సంప్రదాయం. హిజ్రాలు దీవిస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం కూడా. ఇంటికి వచ్చి దీవించినందుకు ప్రతిగా హిజ్రాలకు కొంత డబ్బు ఇస్తుంటారు. అయితే, బంగాల్లోని మాల్దా జిల్లాలో (malda news) ఈ సంప్రదాయం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
జిల్లాలోని బంగ్లా గ్రామంలో (West Bengal news) నివసించే మంపి సర్కార్ దంపతులు.. అక్టోబర్ 29న ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. గత బుధవారం (నవంబర్ 17న) మధ్యాహ్నం కొంతమంది హిజ్రాలు సర్కార్ ఇంటికి వెళ్లారు. పిల్లలకు దీవెనలు అందిస్తామంటూ రూ.5000 డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేమని సర్కార్ వారికి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులతో హిజ్రాలు వాదనకు దిగారు.
ఆరోగ్యం బాలేదని చెప్పినా...
అంతలోనే ఔలద్ అలీ అనే హిజ్రా.. ఓ శిశువును తన ఒడిలోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంటనే రూ.300 ఇస్తానని చెబితే దానికి హిజ్రా ఒప్పుకోలేదని సర్కార్ తెలిపారు. రూ.500 ఇస్తానన్నా వినిపించుకోలేదని అన్నారు. ఎక్కువ డబ్బులు ఇస్తేనే బిడ్డను తిరిగి ఇస్తానని అలీ మొండికేసినట్లు సర్కార్ వివరించారు. శిశువుకు పాలు పట్టేందుకూ అనుమతించలేదని చెప్పారు. చిన్నారికి ఆరోగ్యం బాలేదని చెప్పినా విడిచిపెట్టలేదన్నారు.