నాలుగు రోజులు చికిత్స అనంతరం నవజాత శిశువు మరణించినట్లు తేల్చారు వైద్యులు. చేసేదేమీ లేక ఖననం చేసేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. చివరి క్షణంలో.. పాప ఊపిరి తీసుకోవటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మరో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాలో శనివారం జరిగింది.
ఇదీ జరిగింది:జిల్లాలోని తురువిహాల గ్రామానికి చెందిన ఈరప్ప, అమరమ్మ దంపతులకు మే 10వ తేదీన ఊరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడశిశువు జన్మించింది. మెరుగైన చికిత్స అవసరమని భావించిన అక్కడి వైద్యులు.. సిద్ధనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కానీ, తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సిద్ధనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన మౌలిక వసతులు లేనందునే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లామని తెలిపారు.