తెలంగాణ

telangana

ETV Bharat / bharat

New Virus India: నియోకొవ్​ వైరస్​తో భారత్​కు ముప్పు ఉందా? - భారత్​కు నియోకోవ్​తో ముప్పు లేదు

New Virus India: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కొవిడ్​ నుంచి వచ్చిన మరో వైరస్​ నియోకొవ్​ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్​ అత్యంత వేగంగా వ్యాపించగలదని, మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని చైనా వుహాన్​ ల్యాబ్​ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించారు. అయితే.. నియోకొవ్​తో భారత్​కు ముప్పు పొంచి ఉందా?

NeoCov
నియోకోవ్​

By

Published : Jan 30, 2022, 8:23 AM IST

New Virus India: ఇటీవల వెలుగు చూసిన కరోనా కొత్త వైరస్​ నియోకొవ్​తో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనితో భారత్​కు ఎటువంటి ముప్పు లేదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈటీవీ భారత్​తో మాట్లాడిన ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ జీనోమిక్స్​ అండ్​ ఇంటిగ్రేటివ్​ బయాలజీ శాస్త్రవేత్త వినోద్ స్కేరియా ఈ విషయాన్ని చెప్పారు.

నియోకొవ్​ కొత్త వేరియంట్​ కాదని.. ఇది గబ్బిలాల నుంచి ఉద్భవించిందని తెలిపారు. అయితే దీనికి మానవులకు సోకే లక్షణం లేదని వినోద్​ పేర్కొన్నారు. జంతువుల నుంచి మానవులకు సోకే ఘటనలు చాలా అరుదని అన్నారు. నియోకొవ్​ అనేది తొలిసారిగా నియోరోమిసియా అని పిలిచే గబ్బిలాల జాతిలో గుర్తించినట్లు గుర్తుచేశారు. దీని జన్యువు ఎంఈఆర్​ఎస్​-సీఓవీను (MERS-CoV) పోలి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది జంతువుల్లో మాత్రమే వ్యాప్తి చెందుతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇది జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే అంశంపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉందని వినోద్​ అన్నారు. జీనోమ్​ సీక్వెన్సింగ్​లో మానవులతో పాటు జంతువుల వైరస్​ స్పెక్ట్రమ్​లను అర్థం ముందుగా ఆర్థం చేసుకోవాల్సి ఉందని తెలిపారు.

ఒక్క మ్యుటేషన్​తో..

అయితే ఇందులోని ఓ మ్యుటేషన్‌ కారణంగా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. సార్స్‌ - కొవ్ ‌- 2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేశారు.

'నియో కోవ్‌' వైరస్‌కు.. గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్‌ - కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ (ACE2) ప్రభావవంతగా వాడుకొంటుంది. దీనితో పోలిస్తే మనుషుల్లోని ACE2ను ఏమార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం కొంత తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:కేరళలో తగ్గని కరోనా ఉద్ధృతి.. మరో 50వేల మందికి వైరస్​

ABOUT THE AUTHOR

...view details