కొవిడ్‌తో బాధపడుతూ వెంటిలేటర్ చికిత్స అవసరమయ్యే వారిని గుర్తించేందుకు కేంద్రం నూతన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. 'కొవిడ్ సివియారిటీ స్కోర్' పేరుతో అభివృద్ది చేసిన ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా రోగుల్లో వెంటిలేటర్, ఐసీయూ చికిత్సలు అవసరమయ్యే వారిని గుర్తించవచ్చని వెల్లడించింది.
ఈ సాఫ్ట్‌వేర్‌లోని అల్గారిథమ్.. కొవిడ్ రోగుల లక్షణాలు, పరీక్షల వివరాలు, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ కొలమానాలు, కొవిడ్ సంబంధిత సమస్యలను లెక్కించి.. 'కొవిడ్ సివియారిటీ స్కోర్'ను కేటాయిస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రకటనలో వెల్లడించింది. దీని ఆధారంగా ఐసీయూలో వెంటిలేటర్ చికిత్స అవసరమయ్యే వారిని గుర్తించడం సహా సరైన సమయంలో వైద్యులకు తెలియజేస్తుందని తెలిపింది. ఇదే సమయంలో వెంటిలేటర్ చికిత్స అవసరం లేని వారిని గుర్తించడం ద్వారా పడకల కొరత తీరుతుందని పేర్కొంది.