ఎన్నికలు జరగబోతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తగా రాజకీయ పార్టీల నమోదుపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువును కుదిస్తున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. మామూలుగానైతే దీనికి 30 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంది. కరోనా పరిస్థితుల్లో వారం రోజులకు కుదించినట్లు ఈసీ తెలిపింది.
కొత్త పార్టీల నమోదుపై అభ్యంతరాల గడువు కుదింపు - రాజకీయ పార్టీల నమోదు ప్రక్రియ
వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న వేళ కొత్త పార్టీల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలకుండే అభ్యంతరాల గడువును కుదిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
![కొత్త పార్టీల నమోదుపై అభ్యంతరాల గడువు కుదింపు new parties registration before the elections in four states and one union territory](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10847439-thumbnail-3x2-eci.jpg)
కొత్త పార్టీల నమోదుపై అభ్యంతరాల గడువు కుదింపు
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక పార్టీని ఏర్పాటు చేశాక 30 రోజుల్లో దాని నమోదు కోసం ఈసీకి దరఖాస్తు చేయాలి. ప్రతిపాదిత పేరు గురించి పత్రికల్లో బహిరంగ ప్రకటన ఇచ్చి అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశమివ్వాలి. ప్రచురణ తేదీ నుంచి 30 రోజుల్లోగా వాటిని ఈసీకి సమర్పించాలి.
ఇదీ చదవండి:అసోం మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల