పార్లమెంటు నూతన భవనం.. భారతీయుల నైతికత, 21వ శతాబ్దపు భారతీయ వైవిధ్య గుర్తింపును ప్రతిబింబిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నూతన భవనానికి శంకుస్థాపన చేసినందుకు ప్రధాని నరేంద్రమోదీకిఅభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు.
"నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసినందుకు ప్రధాని మోదీకి అభినందనలు. ఈ భవనం భారతీయుల నైతికత, 21 శతాబ్దపు భారతీయ గుర్తింపును ప్రతిబింబిస్తుంది. వందేళ్ల తర్వాత ఈ నిర్మాణం మోదీ నేతృత్వంలో చేపట్టడం సంతోషంగా ఉంది. ఖరీదు పరంగానే కాకుండా, విధానపరంగానూ ఈ భవనం సౌకర్యవంతంగా ఉంటుంది."