తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లేడీ సింగం' కేసులో తెరపైకి కొత్త పేరు - Shakuntala Chavan Deepali

మహారాష్ట్ర లేడీ సింగం దీపాలీ చవాన్ ఆత్మహత్య కేసులో మరొకరి పేరు వెలుగులోకి వచ్చింది. దీపాలీ తన భర్తకు రాసిన లేఖలో.. మనీషా ఉయికే అనే పేరును ప్రస్తావించారు. తన జీవితం నాశనం కావడానికే మనీషానే కారణమని చెప్పారు. కాగా.. దీపాలీ మృతికి కారణమైన అధికారికి ఉరి శిక్ష విధించాలని ఆమె తల్లి శకుంతల డిమాండ్ చేశారు.

My tigress is no more, what is the use of preserving forest? Deepali's mother
'లేడీ సింగం' కేసులో తెరపైకి కొత్త పేరు

By

Published : Apr 1, 2021, 8:13 PM IST

'దీపాలి అడవిని రక్షించేది. ఇప్పుడు నా ఆడ పులే(దీపాలిని ఉద్దేశించి) లేకుండా పోయింది' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మహారాష్ట్ర 'లేడీ సింగం' దీపాలీ చవాన్ తల్లి శకుంతలా చవాన్. తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన అధికారికి ఉరిశిక్ష విధించాలని... లేదంటే తానే ఆ పని చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై సరైన సమయంలో చర్యలు తీసుకొని ఉంటే.. దీపాలి జీవించి ఉండేదని అన్నారు.

సహోద్యోగులతో దీపాలీ చవాన్

అమరావతి ఎంపీ నవనీత్ రానాతో పాటు విదర్భ ఎమ్మెల్యేను సైతం దీపాలి కలిసిందని.. కానీ ఎవరూ ఆమెకు సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు శకుంతల. ఎలాంటి వసతులు లేని ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చినా.. ఫిర్యాదులేం చేయకుండానే తన పని తాను చేసుకుపోయిందని అన్నారు.

దీపాలీ తల్లి శకుంతలా చవాన్

కొత్త పేరు..

మరోవైపు, దీపాలీ చవాన్ ఆత్మహత్య కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ ఘటనలో మరొకరి పేరు తెరపైకి వచ్చింది. దీపాలి రాసిన మరో లేఖను అధికారులు గుర్తించగా.. 'మనీషా ఉయికే' అనే పేరు బయటకు వచ్చింది. తన జీవితం నాశనం కావడానికి మనీషానే కారణమని దీపాలీ తన లేఖలో పేర్కొన్నారు. ఆమె ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు అంటూ రాసుకొచ్చారు. దీంతో మనీషా ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఈ లేఖను మరణించకముందు తన భర్త రాజేశ్ మోహితేకు రాశారు దీపాలీ.

దీపాలీ చవాన్ రాసిన లేఖ

'వినోద్ అత్యాశపరుడు'

మరోవైపు, దీపాలీని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండెడ్ పోలీసు అధికారి వినోద్ శివకుమార్ ప్రవర్తన సరిగా ఉండదని ఆయనతో పనిచేసినవారు చెబుతున్నారు. వినోద్ అత్యాశపరుడని, దీపాలీని ఎప్పుడు ఒత్తిడికి గురిచేసేవారని ఓ అధికారి ఈటీవీ భారత్​తో చెప్పారు. ఆయన చిత్రహింసలను భరించలేకే.. దీపాలీ ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు.

దీపాలీ చవాన్​కు శ్రద్ధాంజలి ప్రకటిస్తూ..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details