పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకంతో పాటు పలువురిని బదిలీ చేస్తూ (new Governors appointed) కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి మౌర్య రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఆమె స్థానంలో లెఫ్ట్‌నెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (new governor of Uttarakhand) నియమితులయ్యారు.
'బేబి రాణి' రాజీనామా ఆమోదం.. ఆ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు - నాగాలాండ్ గవర్నర్
ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి మౌర్య రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఆమె స్థానంలో లెఫ్ట్‌నెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (new governor of uttarakhand) నియమితులయ్యారు. పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..
తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ పంజాబ్‌కు బదిలీ కాగా.. నాగాలాండ్ గవర్నర్ ఆర్ఎన్. రవి తమిళనాడుకు బదిలీ అయ్యారు. అసోం గవర్నర్ జగదీష్ ముఖికి నాగాలాండ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. బన్వరిలాల్ పురోహిత్‌కు పంజాబ్ గవర్నర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది.
ఇదీ చూడండి :వారణాసిలో మసీదు సర్వేపై హైకోర్టు స్టే!