నూతన సాగు చట్టాలపై ఆమ్ఆద్మీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నూతన సాగు చట్టాలను 'డెత్ వారెంట్'గా అభివర్ణించిన ఆయన.. ఈ చట్టాల వల్ల వ్యవసాయం కొందరు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని తెలిపారు. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన రైతులతో దిల్లీ విధాన సభలో కేజ్రీవాల్ సమావేశం నిర్వహించారు.
కేంద్రానికి విజ్ఞప్తులు..
ఉత్తర్‌ప్రదేశ్ రైతులతో సుదీర్ఘంగా చర్చించిన కేజ్రీవాల్.. నల్లచట్టాలను రద్దు చేయాల్సిందేనన్నారు. ఈ నెల 28న ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరగనున్న 'కిసాన్ పంచాయత్'లో చర్చ జరుగుతుందని.. చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తులు వస్తాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఈ సమావేశానికి దిల్లీ మంత్రులు.. కైలాశ్ గహ్లాత్, రాజేంద్ర పాల్ గౌతమ్‌తో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హాజరయ్యారు.
ఇదీ చదవండి:ఈ నెల 23 నుంచి రైతు నిరసనలు ఉద్ధృతం