కొవిడ్ క్రమంలో తలెత్తుతున్న మ్యూకర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్)ను అరికట్టే 'ఆంఫోటెరిసిన్-బి' ఔషధాన్ని అందుబాటులో ఉంచేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించింది. రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవీయ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
"ఫంగస్ కారక వ్యాధిని నయం చేసే ఆంఫోటెరిసిస్-బి ఔషధ ఉత్పత్తిని దేశీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ మేరకు తయరీదారులతో మాట్లాడాం. మరోవైపు విదేశాల నుంచీ దీన్ని ఎగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం."