దేశంలో కొత్త రకం కరోనా వేరియంట్‌ను గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ఇది డబుల్ మ్యూటెంట్ వేరియంట్ అని పేర్కొంది. కొత్త వేరియంట్‌తో పాటు ఇప్పటికే పలు వేరియంట్లను 18 రాష్ట్రాల్లో గుర్తించామని స్పష్టం చేసింది.
పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రస్తుత విజృంభణకు కారణం కొత్తగా గుర్తించిన ఈ డబుల్ మ్యూటెంట్ వేరియంటే అని స్పష్టంగా చెప్పలేమని తెలిపింది.
గతేడాది ఏర్పాటు చేసిన ఐఎన్ఎస్ఏసీఓజీ (ఇండియన్ సార్స్-సీఓవీ-2 కన్సార్టియమ్ ఆన్ జెనోమిక్స్) ఈ వేరియంట్లను గుర్తించింది. ఇప్పటివరకు ఐఎన్ఎస్ఏసీఓజీ ద్వారా 10,787 పాజిటివ్ నమూనాలలో 771 వేరియంట్లను కనుగొన్నామని కేంద్రం వెల్లడించింది.