తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుదైన 'ఆరాధ్య'.. కొత్త పీతను కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఇది చాలా డిఫరెంట్​! - అరుదైన పీతను కనుగొన్న శాస్త్రవేత్తలు

కర్ణాటకలో ఓ అరుదైన పీత వెలుగులోకి వచ్చింది. ఎల్లాపూర్ ప్రాంతంలో ఈ పీతను గుర్తించారు శాస్త్రవేత్తలు. దానికి 'ఆరాధ్య ప్లాసిడా' అని పేరు పెట్టారు.

new-crab-species-discovered-in-karnataka-new-genus-crab-aradhya-placida
అరుదైన పీతను కనుగొన్న శాస్త్రవేత్తలు

By

Published : May 27, 2023, 6:09 PM IST

Updated : May 27, 2023, 7:06 PM IST

కర్ణాటకలో ఓ కొత్త జాతి పీతను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. దానికి 'ఆరాధ్య ప్లాసిడా' అని పేరు పెట్టారు. ఉత్తర కన్నడ జిల్లాలోని ఎల్లాపూర్ ప్రాంతంలో ఈ పీతను శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్త గోపాలకృష్ణ హెగ్డే, పూణె జూలాజికల్ అబ్జర్వేటరీకి చెందిన డాక్టర్ సమీరాకుమార్, అటవీ శాఖ అధికారి పరశురామ భజంత్రీ.. ఈ కొత్త జాతి పీతను కనుగొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పీతను గుర్తించడం ఇదే మొదటిసారని వారు వెల్లడించారు. దీనిని కనుగొన్న శాస్త్రవేత్త గోపాలకృష్ణ హెగ్డే చిన్న కూతురు పేరు 'ఆరాధ్య'. ఆ పేరును కొత్తగా కనుగొన్న ఈ పీతకు పెట్టారు శాస్త్రవేత్తలు.

'ఆరాధ్య ప్లాసిడా' కేవలం మంచి నీటిలో మాత్రమే నివాసం ఉంటుందని వారు వివరించారు. ఇవి పకృతిలో చాలా అరుదుగా కనిపిస్తాయని పేర్కొన్నారు. సాధారణంగా పీతలు ఒక దగ్గర పొగైనప్పుడు.. అవి ఒక దానిపై ఒకటి దాడి చేసుకుంటాయి. వాటి కొమ్ములు విరిగిపోయేంతగా కొట్టుకుంటాయి. ఆరాధ్య ప్లాసిడా పీతలు మాత్రం ఒకదానిపై ఒకటి దాడి చేసుకోవన్న విషయాన్ని తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కొత్త జాతి పీతలు నిశ్శబ్దంగా ఒక దగ్గరే కూర్చుంటాయని వారు వివరించారు.

పలు జాతుల పీతలను కనుగొన్న శాస్త్రవేత్తలు
గుజరాత్​ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో.. ఇప్పటి వరకు 21 జాతుల పీతలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. తాజాగా ఎల్లాపుర్​లో 22వ కొత్త జాతి పీతను గోపాలకృష్ణ, భజంత్రీల శాస్త్రవేత్తల బృందం గుర్తించారు. దాంతో పాటు 76 రకాల పీతలను ఇదే కనుమల్లో కనుగొన్నారు పలు శాస్త్రవేత్తలు. గోపాలకృష్ణ, భజంత్రీల శాస్త్రవేత్తల బృందం గత రెండేళ్లలలో.. పశ్చిమ కనుమల్లో 76 రకాల పీతలపై పరిశోధనలు చేశారు. 'ఘటియానా ద్వివర్ణ' పీతను కనుగొని దానిని 75వ రకంగా గుర్తించారు. ఆ తర్వాత 'వేళ బాంధవ్య' అనే 76వ జాతిని కూడా వీరు కనుగొన్నారు. ఇప్పుడు 77వ కొత్త రకం పీతను కూడా వీరిద్దరే వెలుగులోకి తెచ్చారు.

కొత్త రకం కప్పను గుర్తించిన పరిశోధకులు.. 'స్ఫేరోథెకా బెంగళూరు'గా నామకరణం..
కొంత కాలం క్రితం భారత్​, ఫ్రాన్స్​ దేశాలకు చెందిన పరిశోధకుల బృందం కొత్త రకం బొరియ కప్ప జాతిని గుర్తించింది. ఉత్తర బెంగళూరులోని రంజన్​కుంటే ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్న సమయంలో ఈ కప్పను గుర్తించారు పరిశోధకులు. నగరానికి గౌరవ సూచికలా దీనికి 'స్ఫేరోథెకా బెంగళూరు'గా నామకరణం చేశారు. వీరి పరిశోధన వివరాలు జూటక్సా అనే అంతర్జాతీయ జర్నల్​లో ప్రచురితమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : May 27, 2023, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details