భారత్లో తాజాగా కొత్త రకం కరోనా కేసులు ఏమీ బయటపడలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫలితంగా యూకే రకం వైరస్ కేసుల సంఖ్య 90వద్ద స్థిరంగా ఉంది.
దేశంలో ఆగిన కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి!
దేశంలో శనివారం యూకే రకం వైరస్ కేసులేమీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త రకం కరోనా సోకిన వారి సంఖ్య 90గానే ఉన్నట్టు తెలిపింది.
దేశంలో 90గానే యూకే రకం వైరస్ కేసుల సంఖ్య
బ్రిటన్లో కరోనా స్ట్రెయిన్ వైరస్ వెలుగుచూడటం వల్ల.. భారత్-యూకే మధ్య నడిచే విమాన సర్వీసులపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని భారత ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నెల 8 నుంచి విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవ్వగా.. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది కేంద్రం. అనంతరం.. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని సూచించింది.
ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 18,645 కరోనా కేసులు