Couple fell from crane: ఈ కాలంలో పెళ్లి అంటే.. సాధారణ కార్యక్రమం మాత్రమే కాదు. అదో ఆడంబరం. విలాసవంతమైన హోటల్లో వేడుకలు, డెస్టినేషన్ వెడ్డింగులు, ఖరీదైన పార్టీలు... ఇలా నవవధూవరులు ఎక్కడా తగ్గడం లేదు.
Chattisgarh marriage crane video
ఇలాగే ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌కు చెందిన జంట సైతం ఘనంగా వివాహ వేడుక నిర్వహించుకోవాలని అనుకుంది. సినిమా స్టైల్లో క్రేన్ ద్వారా వేదికపైకి చేరుకోవాలని భావించింది. అన్ని ఏర్పాట్లూ ఘనంగా చేసుకుంది. అయితే, చివరి నిమిషంలో క్రేన్ వేదికపై కూలిపోయింది. 12 అడుగుల పై నుంచి వధూవరులు కింద పడిపోయారు. దీంతో అతిథులు షాక్‌కు గురయ్యారు.