తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ టెస్టుల్లో కొత్తరకం వైరస్ ఆచూకీ అనుమానమే' - New coronavirus mutants

కరోనాకు చెందిన కొత్తరకం వైరస్​లను ఆర్​టీ- పీసీఆర్​ టెస్టుల్లో గుర్తించడం కష్టంగా మారుతుందని దిల్లీలోని ప్రముఖ వైద్యుడు సౌరదీప్త చంద్ర తెలిపారు. కొత్తవాటిలో వైరస్​ లక్షణాలు కూడా వేరుగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

Dr Souradipta Chandra, New coronavirus mutants
'ఆర్​టీపీసీఆర్​ టెస్టుల్లో కొత్తరకం వైరస్ ఆచూకీ అనుమానమే'

By

Published : Apr 24, 2021, 9:20 AM IST

కొత్తరకం కరోనా వైరస్​ వేరియంట్లను ఆర్​టీ-పీసీఆర్​ టెస్టుల ద్వారా గుర్తించడం సాధ్యం కావడం లేదని దిల్లీలోని హల్వేటియా ఆరోగ్య కేంద్రానికి చెందిన ఫిజీషియన్​ సౌరదీప్త చంద్ర తెలిపారు. కొత్తరకం వైరస్​లలో లక్షణాలు కూడా వేరుగా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.

"కరోనాను గుర్తించేందుకు చేసే ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలతో కొత్తగా పుట్టుకు వస్తున్న వైరస్​లను గుర్తించడం అనేది కష్టంగా మారుతుంది. రెండు, మూడు రకాల వైరస్​ల రకాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆర్​టీపీసీఆర్​ పరీక్షల్లో గుర్తించడం అనేది కష్టంగా మారుతోంది. అంతేగాక వాటి లక్షణాల్లో కూడా మార్పులు ఉన్నాయి."

- డాక్టర్ సౌరదీప్త చంద్ర

కొత్తవైరస్​ సోకిన రోగుల్లో విరేచనాలు, కడుపునొప్పి, దద్దులు రావడం, కండ్లకలక, గందరగోళ స్థితి, వేళ్లు నీలిరంగులోకి మారడం, ముక్కు, గొంతు నుంచి రక్తస్రావం కావడం, ఒంటి, గొంతు నొప్పులు, జ్వరం రావడం, వాసన, రుచిని కోల్పోవడం లాంటివి గుర్తించినట్లు డా. సౌరదీప్త చంద్ర తెలిపారు.

వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు రద్దీ ప్రదేశాల్లో సంచారించడాన్ని నివారించాలని కోరారు. మన దేశంలో మొదటి దశ వ్యాప్తి కంటే రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా ఉందని హెచ్చరించారు.

ఇదీ చూడండి:వైరస్​ సోకినా.. కొవిడ్ రోగుల సేవలో వైద్యులు

ABOUT THE AUTHOR

...view details