తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లంగ్స్​పై భారీ స్థాయిలో కరోనా 2.0 దెబ్బ!' - ఊపిరితిత్తులపై కరోనా స్ట్రైయిన్​

కరోనా రెండో దశలో వైరస్​ ప్రభావం పెరిగిందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులను వైరస్​ వేగంగా దెబ్బతీయగలుగుతోందని స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఎక్కువ కరోనా మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.

corona virus new strain
ఊపిరితిత్తులపై వైరస్​ ప్రభావం

By

Published : Apr 22, 2021, 2:58 PM IST

కరోనా రెండో దశలో ఊపిరితిత్తులను వైరస్​ వేగంగా దెబ్బతీస్తోందని వైద్యులు తెలిపారు. కేవలం 7 రోజుల్లోనే ఊపిరితిత్తులకు 50-70 శాతం నష్టాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు ఛండీగఢ్​ పీజీఐ ఆస్పత్రి పల్మనాలజిస్ట్ ఎస్​కే జిందాల్. కొవిడ్​ మొదటి దశలో ఈ సమయం 14 రోజులుగా ఉండేదని స్పష్టం చేశారు. ఈ కారణంగానే రెండో దశలో ఎక్కువ కరోనా మరణాలు సంభవిస్తున్నాయని వివరించారు.

కరోనా రెండో దశలో వైరస్​ ప్రభావం పెరిగిందంటున్న వైద్యులు

20 ఏళ్ల పాటు రోజుకు 2-3 సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తులకు కలిగేంత నష్టం.. ప్రస్తుతం కరోనా వైరస్​ కారణంగా 2, 3 రోజుల్లోనే వాటిల్లుతోందని వివరించారు జిందాల్.

ABOUT THE AUTHOR

...view details