Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 17,073 మంది వైరస్ బారినపడగా.. మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 15,208 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.57 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,407,046
- మొత్తం మరణాలు: 5,25,020
- యాక్టివ్ కేసులు: 94,420
- కోలుకున్నవారి సంఖ్య: 4,27,87,606
Vaccination India: భారత్లో ఆదివారం 2,49,646 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,11,91,329 కోట్లకు చేరింది. మరో 3,03,604 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 290,919 మంది వైరస్ బారినపడ్డారు. మరో 515 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,350,835కు చేరింది. ఒక్కరోజే 346,304 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 523,861,606గా ఉంది.
- ఇటలీ ఒక్కరోజే 48,456 మంది కొవిడ్ బారినపడగా..44 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తైవాన్లో 39,646 కొత్త కేసులు నమోదుకాగా.. 134 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో ఒక్కరోజే 23,648 కొత్త కేసులు బయటపడగా.. 26 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 16,679 కేసులు నమోదు కాగా.. 41 మంది మరణించారు.
- మెక్సికోలో 16,214 కేసులు వెలుగుచూశాయి. 23 మందికిపైగా చనిపోయారు.
ఇదీ చదవండి:ఆంగ్లేయులపై మహిళలతో తుపాకులు ఎక్కుపెట్టించిన నేతాజీ