దేశంలో కొవిడ్ ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 50,040 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి ధాటికి మరో 1,258 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగింది.
- మొత్తం కేసులు:3,02,33,183
- యాక్టివ్ కేసులు:5,86,403
- కోలుకున్నవారు:57,944
- మొత్తం మరణాలు:3,95,751
40 కోట్ల పరీక్షలు..
దేశవ్యాప్తంగా శనివారం 17,77,309 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 403,589,201కు చేరినట్లు చెప్పింది.