New CEC of India: కేంద్ర ఎన్నికల సంఘం 25వ ప్రధాన కమిషనర్(సీఈసీ)గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన నిర్వాచన్ సదన్‌లో ఆయన ఆదివారం సీఈసీగా విధుల్లో చేరారు. ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సుశీల్ చంద్ర.. శనివారమే పదవీ విరమణ చేశారు.
సీఈసీగా రాజీవ్ బాధ్యతలు- 2024 లోక్‌సభ ఎన్నికలకు ఆయనే సారథి! - new cec of india
CEC Rajiv kumar: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా.. రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. 2025 ఫిబ్రవరి వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
![సీఈసీగా రాజీవ్ బాధ్యతలు- 2024 లోక్‌సభ ఎన్నికలకు ఆయనే సారథి! cec rajiv kuma](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15291392-994-15291392-1652601994273.jpg)
కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను ఇటీవల రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ఫిబ్రవరి వరకు రాజీవ్ సీఈసీగా ఉంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు 2024లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఆయన సారథ్యంలోనే జరగనున్నాయి.
1960 ఫిబ్రవరి 19న జన్మించిన రాజీవ్.. బీఎస్సీ, ఎల్ఎల్బీ, పీజీడీఎం, ఎంఏ(పబ్లిక్ పాలసీ) చేశారు. బిహార్/ఝార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి(1984 బ్యాచ్) అయిన ఆయన.. 2020 ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. 2020 సెప్టెంబర్ 1న ఎన్నికల కమిషనర్‌గా రావడానికి ముందు 'ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక మండలి' ఛైర్‌పర్సన్‌గా సేవలందించారు.