తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్వరలోనే కొత్త సీడీఎస్​ ఎంపిక- రాజ్​నాథ్ వద్దకు అర్హుల జాబితా - new cds of india

New CDS appointment: కొత్త సీడీఎస్ ఎంపికకు సంబంధించి అర్హుల జాబితాను త్వరలోనే రాజ్​నాథ్​ సింగ్​ వద్దకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయన ఆమోదం తర్వాత తుది నిర్ణయం కేబినెట్ నియామకాల కమిటీ తీసుకుంటుందన్నారు.

New CDS appointment, సీడీఎస్​ ఎంపిక
త్వరలోనే కొత్త సీడీఎస్​ ఎంపిక

By

Published : Dec 17, 2021, 6:10 PM IST

New CDS appointment: నూతన త్రిదళాధిపతిని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. త్రివిధ దళాల సిఫారసు మేరకు అర్హుల జాబితాను త్వరలోనే రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​కు అందజేయనున్నట్లు తెలిపారు. హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్ బిపిన్​ రావత్ వారసుడ్ని ఎంపిక చేసేందుకు ఆర్మీ, నేవీ, వాయుసేన సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్​ను ప్రభుత్వం ఖరారు చేస్తోందని చెప్పారు. ఈ ప్యానెల్ సిఫారసు చేసిన పేర్లను రాజ్​నాథ్ సింగ్​కు పంపుతామన్నారు. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం సీడీఎస్​ ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే కేబినెట్​ నియామకాల కమిటీ వద్దకు పేర్లు వెళతాయన్నారు.

New CDS of India

కొత్త సీడీఎస్​గా ఎంపికయ్యే అవకాశాలు సైన్యాధిపతి జరనల్ ఎంఎం నరవణెకే అధికంగా ఉన్నాయి. అనుభవంలో అందరికన్నా సీనియర్ కావడం వల్ల ఈ పదవి దాదాపు ఆయనకే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్​గా జనరల్​ బిపిన్​ రావత్​ నుంచి 2019, డిసెంబర్​ 31న బాధ్యతలు స్వీకరించారు నరవణె. 2022, ఏప్రిల్​ వరకు ఆయన పదవీకాలం ఉంది. ప్రస్తుతం నౌకాదళ అధినేత అడ్మిరల్​ ఆర్​ హరి కుమార్​ ఆ బాధ్యతలు నవంబర్​ 30నే స్వీకరించారు. అలాగే, వాయుసేన చీఫ్​ మార్షల్​ వివేక్​ రామ్​ చౌదరి సెప్టెంబర్​ 30న బాధ్యతలు తీసుకున్నారు. వీరు పదవులు చేపట్టి కేవలం రెండు నెలలు పూర్తయింది.

Bipin Rawat Successor: త్రివిధ దళాలకు అధిపతుల ఎంపికకు అనుసరిస్తున్న విధానాన్నే సీడీఎస్​ విషయంలోనూ కేంద్రం పాటించనుంది. చీఫ్స్​ ఆప్ స్టాఫ్ కమిటీ(సీఓఎస్​సీ)కి సీడీఎస్​ అధిపతిగా వ్యవహరిస్తారు.

తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది చనిపోయారు. మృతుల్లో రావత్ సతీమణి కూడా ఉన్నారు.

ఇదీ చదవండి:CDS Chopper Crash: మరో రెండు వారాల్లో ట్రై సర్వీస్​ విచారణ పూర్తి!

ABOUT THE AUTHOR

...view details