కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా బుధవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అందులో 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
మంత్రివర్గ విస్తరణకు ముందు.. సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, కిరణ్ రిజిజు, మన్సుఖ్ మాండవ్య, హరిదీప్‌సింగ్ పురీ, రామ చంద్ర ప్రసాద్ సింగ్.. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గం ఇదే..
శాస్త్ర-సాంకేతిక శాఖ, అణుశక్తి, అంతరిక్షం, సిబ్బంది- ప్రజా ఫిర్యాదుల శాఖలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వద్దే అట్టిపెట్టుకున్నారు.
కేబినెట్ మంత్రులు- వారి శాఖలు:
- రాజ్‌నాథ్ సింగ్-రక్షణ శాఖ
- అమిత్ షా-హోంశాఖ, సహకార శాఖ
- నితిన్ గడ్కరీ- ఉపరితల రవాణా శాఖ
- నిర్మలా సీతారామన్-ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ
- నరేంద్ర సింగ్ తోమర్- వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ
- ఎస్.జైశంకర్-విదేశాంగ శాఖ
- అర్జున్ ముండా- గిరిజన వ్యవహారాల శాఖ
- స్మృతి ఇరానీ- మహిళా సాధికారత, శిశు సంక్షేమ శాఖ. స్వచ్ఛ భారత్ మిషన్ పర్యవేక్షణ
- పీయూష్ గోయల్- వాణిజ్య శాఖలు. జౌళి, వినియోగదారుల సంక్షేమ శాఖ, ఆహార- ప్రజా పంపిణీ శాఖ
- ధర్మేంద్ర ప్రదాన్- విద్యా శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ
- ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ- మైనారిటీ వ్యవహారాల శాఖ
- ప్రహ్లాద్ జోషీ- పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు- గనుల శాఖ
- మహేంద్రనాథ్ పాండే- నైపుణ్యాబివృద్ధి శాఖ
- గిరిరాజ్ సింగ్- గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ
- గజేంద్ర సింగ్ శెకావత్- జల్ శక్తి శాఖ
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు..
కేబినెట్ హోదా(15)
- నారాయణ్ రాణే-ఎంఎస్ఎంఈ శాఖ
- సర్బానంద సోనోవాల్-జలమార్గాలు, పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ; ఆయుష్ శాఖ
- డా. వీరేంద్ర కుమార్-సామాజిక న్యాయం, సాధికారత శాఖ
- జ్యోతిరాదిత్య సింధియా-పౌరవిమానయాన శాఖ
- రామచంద్ర ప్రసాద్ సింగ్-ఉక్కు శాఖ
- అశ్వినీ వైష్ణవ్-రైల్వే; కమ్యూనికేషన్స్; ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ
- పశుపతి కుమార్ పరాస్-ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ
- కిరణ్ రిజిజు-న్యాయ శాఖ
- రాజ్‌కుమార్ సింగ్-విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ
- హర్దీప్ సింగ్ పురీ-గృహ-పట్టణాభివృద్ధి శాఖ; పెట్రోలియం, సహజ వనరుల శాఖ
- మన్సుఖ్ మాండవియా-ఆరోగ్య శాఖ; రసాయన- ఎరువుల శాఖ
- భూపేందర్ యాదవ్-పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ; కార్మిక, ఉపాధి కల్పన శాఖ
- పురుషోత్తం రూపాలా-మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ శాఖ
- కిషన్ రెడ్డి-సాంస్కృతిక, పర్యాటక శాఖ; ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ
- అనురాగ్ సింగ్ ఠాకూర్-సమాచార ప్రసార శాఖ; క్రీడా, యువజన వ్యవహారాల శాఖ
సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా)
- రావ్ ఇంద్రజిత్ సింగ్- గణాంక శాఖ; ప్రణాళిక; కార్పొరేట్ వ్యవహారాల శాఖ
- జితేంద్ర సింగ్- శాస్త్ర, సాంకేతిక శాఖ; భూశాస్త; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్; అణు శక్తి, అంతరిక్షం; ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి
సహాయ మంత్రులు(32)
- శ్రీపాద నాయక్- పోర్టులు, షిప్పింగ్, జల మార్గాలు; పర్యాటక శాఖ
- ఫగ్గాన్సింగ్ కులాస్తే- ఉక్కు, గ్రామీణ అభివృద్ధి
- ప్రహ్లద్ సింగ్ పటేల్- జల్ శక్తి, ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ
- అశ్వినీ కుమార్ చౌబే- వినియోగదారుల వ్యవహారాలు; ఆహార, ప్రజా పంపిణీ; పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ
- అర్జున్ రామ్ మేఘవాల్- పార్లమెంటరీ వ్యవహారాలు; సాంస్కృతిక శాఖ
- వీకే సింగ్- రోడ్డు రవాణా, రహదారులు; పౌర విమానయాన శాఖ
- శ్రీకృష్ణన్ పాల్- విద్యుత్; భారీ పరిశ్రమల శాఖ
- ధన్వే రావ్‌సాహెబ్- రైల్వే; బొగ్గు; గనుల శాఖ
- రాందాస్ అఠవాలే- సామాజిక న్యాయం, సాధికారత శాఖ
- సాధ్వి నిరంజన్ జ్యోతి- వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ; గ్రామీణాభివృద్ధి
- సంజీవ్ కుమార్ బల్యాణ్- మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖ
- నిత్యానంద రాయ్- హోంశాఖ
- పంకజ్ చౌధరీ- ఆర్థిక శాఖ
- అనుప్రియా సింగ్ పటేల్- వాణిజ్యం, పరిశ్రమలు
- ఎస్పీ సింగ్ బఘేల్- న్యాయ శాఖ
- రాజీవ్ చంద్రశేఖర్- నైపుణ్యాధివృద్ధి; ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ
- శోభా కరాండ్లజె- వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ
- భానుప్రతాప్ సింగ్ వర్మ- సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
- దర్శన విక్రమ్ జర్దోష్- టెక్ట్స్‌టైల్స్; రైల్వే శాఖ
- వి. మురళీధరన్- విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
- మీనాక్షి లేఖి- విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ
- సోమ్ ప్రకాశ్- వాణిజ్యం, పరిశ్రమలు
- రేణుకా సింగ్ సరుతా- గిరిజన వ్యవహారాలు
- రామేశ్వర్ తెలి- పెట్రోలియం, సహజ వాయువు; కార్మిక, ఉపాధి శాఖ
- కైలాశ్ చౌదరి- వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమం
- అన్నపూర్ణా దేవి- విద్యా శాఖ
- ఎ. నారాయణస్వామి- సామాజిక న్యాయం, సాధికారత శాఖ
- కౌశల్ కిశోర్- గృహ, పట్టణ వ్యవహారాల శాఖ
- అజయ్ భట్- రక్షణ శాఖ సహాయ మంత్రి, పర్యటక శాఖ
- బి.ఎల్. వర్మ- ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ
- అజయ్ కుమార్- హోం శాఖ
- దేవ్‌సింగ్ చౌహాన్- కమ్యూనికేషన్స్ శాఖ
ఇవీ చదవండి: కేబినెట్ నుంచి కీలక నేతలు ఔట్- ఎందుకిలా?