Indian Amry chief: లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే.. భారత సైన్యం 28వ సారథిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. నియామకాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ.. పాండేను సైన్యాధిపతిగా ఎంపిక చేసింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాండేను ఆయన వారసుడిగా ఖరారు చేసింది కేంద్రం. కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఆర్మీ చీఫ్ కానున్న తొలి వ్యక్తి పాండేనే కావడం విశేషం. ఆర్మీ చీఫ్ కోసం పాండేతోపాటు జై సింగ్ నయన్, అమర్దీప్ సింగ్ భిందర్, యోగేంద్ర దిమ్రీ పేర్లు పరిశీలించింది కేంద్రం. వీరిలో పాండే అత్యంత సీనియర్. లెప్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్నారు. ఈయన మే 1న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే- తొలిసారి ఇంజినీర్‌కు సైన్యం బాధ్యతలు - army chief general manoj pande
Indian Amry chief: భారత సైన్యం తదుపరి సారథిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ పాండేను నరవాణే వారసుడిగా ఎంపిక చేసింది.
లెప్టినెంట్ జనరల్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఈయన 1982 డిసెంబరులో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగంలో నియమితులయ్యారు. తన 39 ఏళ్ల సర్వీస్‌లో కొంతకాలం జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పల్లన్వాలా సెక్టార్లో ఇంజనీరింగ్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు. లెఫ్టినెంట్ జనరల్ పాండే వెస్ట్రన్ థియేటర్‌లో ఇంజనీర్ బ్రిగేడ్, నియంత్రణ రేఖ వెంబడి పదాతిదళ బ్రిగేడ్, లద్ధాఖ్ సెక్టార్‌లోని పర్వత విభాగం, ఈశాన్య భాగంలో కార్ప్స్‌కు నాయకత్వం వహించారు. ఆపరేషన్ పరాక్రమ్లోనూ పాలుపంచుకున్నారు.
ఇదీ చదవండి:మోదీ నయా ట్రెండ్.. గురువారం ఎర్రకోట నుంచి ప్రసంగం