తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైతులతో చర్చలకు ఇప్పటికీ సిద్ధమే' - రైతుసంఘాల నేతలతో చర్చలు

రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీతో దిల్లీలోని చాలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ క్రమంలో అన్నదాతలతో ప్రభుత్వం తిరిగి చర్యలు జరుపుతుందా? లేదా? అనే సందేహం అందరిలో తలెత్తింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. రైతులతో చర్చలను ఆపివేయడం అనేది జరగదని స్పష్టం చేసింది. తిరిగి వారితో ఎప్పుడు చర్చలు చేపట్టే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

Never said doors for dialogue with farmers shut: Javadekar
'రైతులతో చర్చలకు ఇంకా సిద్ధంగానే ఉన్నాం'

By

Published : Jan 27, 2021, 5:50 PM IST

సాగు చట్టాల రద్దుపై రైతు సంఘాలతో చర్చలకు తలుపులు మూసుకుపోలేదని కేంద్రం వెల్లడించింది. చర్చలకు సంబంధించి అవకాశాలు ముగిసినట్లు తామెప్పుడూ చెప్పలేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు. చర్చలు జరపాలని నిర్ణయించుకుంటే కొత్త తేదీని వెల్లడిస్తామని తెలిపారు.

దిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా మంగళవారం హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"రైతులతో చర్చలు ఆపేస్తామని మేము చెప్పలేదు, మీరు వినలేదు. చర్చలు తిరిగి ఎప్పుడు చేపట్టాలి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తేదీ నిర్ణయించిన వెంటనే వివరాలు వెల్లడిస్తాము."

-ప్రకాశ్​ జావడేకర్

11 విడత చర్చల్లో పాల్గొన్న రైతులు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని కేంద్రానికి తేల్చిచెప్పారు. 12-18 నెలల పాటు చట్టాలను నిలిపివేస్తామన్న తమ ప్రతిపాదనను మరోమారు పరిశీలించాలని కేంద్రం అభ్యర్థించినా.. రైతులు తమ డిమాండ్​పై వెనక్కి తగ్గలేదు.

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మంగళవారం జరిగిన హింసపై చర్చించారా? అని అడిగిన ప్రశ్నకు జావడేకర్​ భిన్నంగా స్పందించారు. "మేము మంత్రివర్గంలో సభ్యులం. ఆ పని భద్రతా కమిటీ చూసుకుంటుంది" అని అన్నారు. హింసపై ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందో.. తనకూ అలాంటి భావనే ఉందని తెలిపారు.

ఇదీ చూడండి:దిల్లీ ఘటనలతో రైతు ఉద్యమంలో చీలిక!

ABOUT THE AUTHOR

...view details