దేశాలు, రాష్ట్రాలు, నగరాలకు రహదారులే జీవనాధారం. రహదారులే అభివృద్ధికి మొదటి చిహ్నం. ప్రజలకు.. వారి అవసరాలు, సౌకర్యాలు తీర్చేందుకు ఈ రోడ్లు ఉపకరిస్తాయి. అందుకే రాజకీయ నాయకులు సరైన రోడ్డు నిర్మిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీలు చేస్తుంటారు.
కేంద్రం లెక్కల ప్రకారం..
జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా 62,15,797 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం విస్తరించి ఉంది. వీటిలో 1,36,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు. మొత్తం రహదారుల్లో జాతీయ రహదారుల శాతం 2.19. కానీ ఈ రోడ్లపైనే అధిక రవాణా జరుగుతుంది.
జాతీయ రోడ్డు, జాతీయ రహదారుల సమావేశం 2021, మార్చి 24 నుంచి ప్రారంభం కానుంది. వర్చువల్గా జరిగే ఈ సమావేశంలో రోడ్డు నిర్మాణ సమస్యలు, సవాళ్లపై చర్చించనున్నారు.
ఏటేటా పెరుగుతున్న రోడ్డు నిర్మాణం
గత దశాబ్దం లెక్కలు మనం పరిశీలిస్తే.. ఏటేటా రోడ్డు నిర్మాణం పెరుగుతోంది. దీని ఫలితంగా టెండర్ ప్రక్రియ, నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
రహదారులే జీవనాధారం- ఏటా పెరుగుతున్న నిర్మాణం ప్రస్తుత,వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నిర్మాణం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాలు నూతన లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 12వేల కిలోమీటర్లు నిర్మించాల్సిందిగా లక్ష్యం నిర్దేశించింది ప్రభుత్వం.
రోజుకు 30 కిలోమీటర్ల నిర్మాణం..
గడచిన కొన్ని సంవత్సరాల నుంచి రహదారుల నిర్మాణంలో వేగం పెరిగింది. గత మూడేళ్లలో జాతీయ రహదారి నిర్మాణం చూస్తే సగటున 10వేల కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించారు. 2021, ఫిబ్రవరి 5.. నాటికి 9,242 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించారు. ఈ లెక్కన రోజుకు 30(29.81) కిలోమీటర్లు నిర్మాణం జరుగుతోంది.
రహదారులే జీవనాధారం- ఏటా పెరుగుతున్న నిర్మాణం జాతీయ రహదారుల నెట్వర్క్ పరిశీలిస్తే..
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వ్యాప్తి పెరుగుతోంది. జాతీయ రహదారుల వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలు ఒకదానితోని ఒకటి కలిసిపోయాయి. రహదారుల వల్ల అభివృద్ధి ప్రతి గ్రామానికి, మారుమూల ప్రాంతాలకు వెళ్లింది. ప్రతి రాష్ట్రంలో జాతీయ రహదారుల సంఖ్య పెరుగుతోంది. దీనికోసం బడ్జెట్ను కేంద్రమే కేటాయిస్తుంది. గత మూడేళ్లలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రహదారుల నిర్మాణం కింద కేటాయించిన బడ్జెట్ వివరాలను లోక్సభలో ఉంచింది కేంద్ర ప్రభుత్వం.
రహదారులే జీవనాధారం- ఏటా పెరుగుతున్న నిర్మాణం ఈ లెక్కల ప్రకారం మహారాష్ట్రలో జాతీయ రహదారుల నిర్మాణానికి అత్యధికంగా కేటాయించింది కేంద్రం.
ఇదీ చదవండి :నక్సల్స్ ఘాతుకం- ఐదుగురు జవాన్లు మృతి