జనవరి 29న భారత్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడి బాధ్యులను శిక్షిస్తామని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు హామీ ఇచ్చారు. ఇజ్రాయిలీ ప్రతినిధులను రక్షించేందుకు కృషిచేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు నెతన్యాహు.
ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు, రాయబార కార్యాలయ భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మోదీ పేర్కొన్నారు. నెతన్యాహూతో మోదీ ఫోన్లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ దాడి ఘటనలో భారత్, ఇజ్రాయెల్ భద్రతా సంస్థల మధ్య సమన్వయం పట్ల ఇరువురు దేశాధినేతలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కరోనా మహమ్మారిపైనా ఉమ్మడి పోరు కొనసాగించాలని నిర్ణయించారని వెల్లడించింది.
ఇదీ చూడండి: బాంబు పేలుడుపై ఇజ్రాయెల్ మంత్రికి జైశంకర్ ఫోన్