తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సవాళ్లు ఎదురవుతాయని నేతాజీ ఊహించారు'

నేతాజీ సుభాష్​ చంద్రబోస్​కు దేశం పట్ల ఉన్న అమితమైన ప్రేమే మిగతావాటన్నింటినీ అధిగమించేలా చేసిందని ఆయన కూతురు డా. అనితా బోస్ అన్నారు. నేతాజీ 125వ జయంతిని ఘనంగా నిర్వహించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయించడాన్ని ఆమె స్వాగతించారు.

Netaji's dominant emotion was, his great love for his country and that superseded everything else
'సవాళ్లు ఎదురవుతాయని నేతాజీ ఊహించారు'

By

Published : Jan 23, 2021, 2:38 PM IST

Updated : Jan 23, 2021, 3:12 PM IST

నేతాజీ సుభాష్​ చంద్రబోస్ 125 జయంతిని వేడుకగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆయన కూతురు డా. అనితా బోస్​ పాఫ్. దేశం పట్ల ఆయనుకున్న అమితమైన ప్రేమే మిగతావాటన్నింటీని అధిగమించేలా చేసిందని తెలిపారు. స్నేహితులు, కుటుంబంతో విధేయతగా ఉండేవారని, దేశం స్వేఛ్చ కోసం ప్రాణాలనే పణంగా పెట్టారని స్మరించుకున్నారు.

124 ఏళ్ల క్రితం భరతమాత ముద్దుబిడ్డ కటక్​లో జన్మించారని అనితా బోస్​ గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం సవాళ్లు ఎదురవుతాయని నేతాజీ ముందుగానే ఉహించారని చెప్పారు.

చివరి పోరాటం..

నేతాజీ 125వ జయంతిని పరాక్రమ్​ దివాస్​​గా జరుపుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుభాష్​ చంద్రబోస్​ మనవడు సీకే బోస్​ హర్షం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో ప్రాణాలు అర్పించారని.. కానీ చివరి పోరాటం చేసింది మాత్రం ఆజాద్​ హింద్​ ఫౌజ్​ అని పేర్కొన్నారు.

Last Updated : Jan 23, 2021, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details