Netaji hologram statue India Gate: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించేలా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దిల్లీలో అబ్బురపరిచే నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రానైట్‌తో తయారు చేసే ఈ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద స్థాపించనున్నట్లు వెల్లడించారు.
Subhas Chandra Bose granite statue:
పూర్తిస్థాయి విగ్రహం రూపొందే వరకు ఈ ప్రదేశంలో నేతాజీ హాలోగ్రామ్ (బీమ్ లైట్లతో ఏర్పాటు చేసే 3డీ చిత్రం) విగ్రహం ఉంటుందని మోదీ తెలిపారు. నేతాజీ జయంతి అయిన జనవరి 23న హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. నేతాజీకి భారత్ రుణపడి ఉంటుందని, ఇందుకు ఈ విగ్రహమే తార్కాణమని మోదీ పేర్కొన్నారు.
ఇదే సరైన నివాళి..
నేతాజీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడాన్ని స్వాగతించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశ స్వేచ్ఛ కోసం సర్వం ధారపోసిన యోధునికి ఇదే సరైన నివాళి అని ట్వీట్ చేశారు.