తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గొడ్డలితో నరికి మేనమామ హత్య... తలతో ఊరంతా తిరిగి.. - మేనమామ తల నరికి హత్య

Nephew killed maternal uncle: తండ్రి చావుకు బాధ్యుడని భావించి మేనమామను హత్య చేశాడు ఓ యువకుడు. గొడ్డలితో తల నరికి హతమార్చాడు. అనంతరం, మొండెం నుంచి వేరు చేసిన తలను పట్టుకొని ఊరంతా తిరిగాడు.

nephew strangled maternal uncle
nephew strangled maternal uncle

By

Published : May 13, 2022, 8:29 PM IST

Nephew killed maternal uncle: క్షుద్రపూజలు చేస్తున్నాడన్న ఆరోపణలతో మేనమామ తలను తెగనరికాడు ఓ వ్యక్తి. గొడ్డలితో నరికి తల, మొండాన్ని వేరు చేశాడు. ఆ తర్వాత తలను చేత్తో పట్టుకొని వీధుల్లో తిరిగాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ సీధీ జిల్లాలోని కరి మాటి గ్రామంలో జరిగింది. నిందితుడిని రవీంద్ర సింగ్ గౌర్​(26)గా గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ.. ఆ ప్రాంతంలో భయాందోళనకర వాతావరణం నెలకొంది.

చేతిలో తలతో గ్రామంలో యువకుడు హల్​చల్

పోలీసుల కథనం ప్రకారం.. కొన్ని సంవత్సరాల క్రితం రవీంద్ర సింగ్ తండ్రి చనిపోయాడు. అయితే, తన తండ్రి చావుకు మేనమామ మక్సుదన్ సింగ్ గౌర్ (60) కారణమంటూ రవీంద్ర ఆరోపించేవాడు. క్షుద్రపూజలు చేయడం వల్లే తండ్రి మరణించాడని చెప్పేవాడు. ఈ క్రమంలోనే మక్సుదన్​పై ప్రతీకారం తీర్చుకుంటానని గతంలోనే సవాల్ విసిరాడు. అప్పటి నుంచి సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.

మృతదేహం

నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అదనపు ఎస్పీ అంజులత పట్లే తెలిపారు. సమాచారం అందగానే దీనిపై కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. మృతుడి తలను పట్టుకొని 2.5 కిలోమీటర్ల పాటు తిరిగాడని తెలిపారు. స్థానిక పోలీసులు సమాచారం అందుకొని అతడిని అరెస్టు చేశారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details