తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవాగ్జిన్​​' అత్యవసర వినియోగానికి నేపాల్ అనుమతి - నేపాల్ ఔషధ నియంత్రణ మండలి

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా 'కొవాక్జిన్'​​ అత్యవసర వినియోగానికి నేపాల్ ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే నేపాల్​లో కొవిషీల్డ్, సినోఫామ్​ టీకాలు వినియోగంలో ఉన్నాయి.

Nepal gives emergency use approval to Bharat Biotech's Covaxin
కొవాక్సిన్​ టీకా అత్యవసర వినియోగానికి నేపాల్ అనుమతి

By

Published : Mar 20, 2021, 2:36 PM IST

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ అత్యవసర వినియోదానికి నేపాల్ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలి కొవాగ్జిన్​ వినియోగానికి ఆమోద ముద్ర వేసింది.

ఇప్పటికే నేపాల్‌లో ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌, చైనాకు చెందిన సినోఫామ్ టీకాలు అత్యవసర వినియోగంలో ఉండగా.. ప్రస్తుతం కొవాగ్జిన్ అనుమతి పొందింది.

మూడో దశ క్లినికల్ పరీక్షల్లో కొవాగ్జిన్‌ 81 శాతం సమర్థంగా పనిచేస్తుందని తేలడం వల్ల నేపాల్‌ ప్రభుత్వం కొవ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతించింది.

ఇదీ చదవండి:'ఇండోపసిఫిక్​ సుస్థిరతకు అమెరికా-భారత్​ బంధం కీలకం'

ABOUT THE AUTHOR

...view details