తెలంగాణ

telangana

నేపాల్​-బంగ్లాదేశ్​ చెంతకు భారతీయ టీకా

By

Published : Jan 21, 2021, 8:05 PM IST

భారతీయ కరోనా వ్యాక్సిన్​ కోవిషీల్డ్​.. నేపాల్​, బంగ్లాదేశ్​లకు చేరింది. ఆయా దేశాలకు టీకా అందినట్టు ట్వీట్​ చేశారు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​.

Nepal and Bangladesh receive Coronavirus vaccines sent by India
భారత వ్యాక్సిన్​ను స్వీకరించిన నేపాల్​, బంగ్లాదేశ్​

భారత్​ పంపిన కొవిడ్​-19 టీకాను నేపాల్​, బంగ్లాదేశ్​లు గురువారం స్వీకరించాయి. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జై శంకర్​ ట్విట్టర్​లో తెలిపారు. పొరుగు దేశాల ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం తమ విదేశీ విధానాల్లో భాగమని పేర్కొన్నారు మంత్రి. బంగ్లాదేశ్​కు 20లక్షలు, నేపాల్​కు 10లక్షల డోసుల చొప్పున కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ను సరఫరా చేసినట్టు చెప్పారు.

వ్యాక్సిన్​ 'మైత్రి'తో బంగ్లాదేశ్​-భారత్​ల సంబంధానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో స్పష్టమవుతోందని జైశంకర్​ అన్నారు. ఎయిర్​ఇండియా విమానంలో ఢాకాకు వ్యాక్సిన్​లను పంపిన ఫొటోలను ఆయన ట్విట్టర్​లో పంచుకున్నారు.

అయితే.. బుధవారం కూడా భారత్​ నుంచి భూటాన్​కు 1.5లక్షలు, మాల్దీవులకు లక్ష మోతాదుల కొవిషీల్డ్​ టీకాను పంపింది విదేశాంగ శాఖ. త్వరలోనే మయన్మార్​, సీషెల్స్​ దేశాలకు వ్యాక్సిన్​ పంపనుంది. కొన్ని అనుమతుల అనంతరం.. అఫ్గానిస్థాన్​, మారిషస్​లకూ టీకా సరఫరా ప్రారంభమవుతుందని ఇప్పటికే ప్రకటించింది భారత్.

ఇదీ చదవండి:'సీరం'​లో అగ్ని ప్రమాదం.. అదుపులోకి మంటలు

ABOUT THE AUTHOR

...view details