తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చాక్లెట్​ కోసం డబ్బులిచ్చి మరో ఘటనలో.. - అమేఠీ న్యూస్​

Neighbour Rapes Minor Girl: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ అమానవీయ ఘటన దిల్లీ సమీపంలోని ఫరిదాబాద్​లో జరిగింది. మరో ఘటనలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీలో ఈ దారుణం జరిగింది.

Neighbour Rapes Minor Girl
ncr rape news

By

Published : Apr 14, 2022, 7:06 AM IST

Neighbour Rapes Minor Girl: దేశ రాజధాని పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. దిల్లీ సమీపంలోని ఫరిదాబాద్​లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు రికేశ్​ అనే వ్యక్తి. చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పాలి క్రషర్ జోన్​ పోలీసులు బుధవారం తెలిపారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉండగా వెళ్లి.. ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు రికేశ్. ఈ విషయం ఎవరికీ చెప్పొదంటూ చిన్నారిని భయపెట్టాడు. ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధరించారు.

మరోవైపు.. ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు అదే గ్రామానికి చెందిన వ్యక్తి. బాలిక తన సోదరిమణులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటోంది. వీరి వద్దకు వచ్చిన నిందితుడు.. మిగతా వారికి 100 రూపాయలు ఇచ్చి చాక్లెట్లు కొనుక్కోమని పంపించాడు. బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె పారిపోతుండగా.. ఈ విషయం బయటపెట్టకూడదంటూ బెదిరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:ఆ పనికి అడ్డొస్తున్నాడని.. మూడేళ్ల చిన్నారిని హత్యచేసిన తల్లి

ABOUT THE AUTHOR

...view details