తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NEET Results 2023: నీట్​ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థికి ఫస్ట్​ ర్యాంక్​

Neet Results
Neet Results

By

Published : Jun 13, 2023, 9:40 PM IST

Updated : Jun 13, 2023, 10:15 PM IST

21:29 June 13

నీట్‌లో 42,836 మంది ఏపీ విద్యార్థులు అర్హత

NEET UG Results: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్‌ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థి ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకులో మెరిసి సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌ 99.99 పర్సంటైల్‌ సాధించి తొలి ర్యాంకు సాధించినట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. నీట్​కు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది నీట్‌కు దేశవ్యాప్తంగా మొత్తం 11,45,976మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654మంది అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి తొలి ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో ఏపీ విద్యార్థి కె.యశశ్రీకి రెండో ర్యాంకు సాధించారు.

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్‌తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4,097 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌ 4న ప్రిలిమినరీ ఆన్షర్‌ కీని విడుదల చేసిన ఎన్​టీఏ.. దీనిపై జూన్‌ 6 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్​టీఏ అధికారులు తాజాగా తుది ఆన్సర్‌ కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు.

Last Updated : Jun 13, 2023, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details