నీట్ పోస్ట్‌గ్రాడ్యుయేట్(పీజీ) పరీక్ష తేదీని ఖరారు చేసింది కేంద్రం. సెప్టెంబర్ 11న నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.
"నీట్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ పరీక్ష సెప్టెంబర్ 11న నిర్వహించాలని నిర్ణయించాం"
18:13 July 13
Neet 2021: 'నీట్' పీజీ పరీక్ష తేదీ ఖరారు
నీట్ పోస్ట్‌గ్రాడ్యుయేట్(పీజీ) పరీక్ష తేదీని ఖరారు చేసింది కేంద్రం. సెప్టెంబర్ 11న నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.
"నీట్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ పరీక్ష సెప్టెంబర్ 11న నిర్వహించాలని నిర్ణయించాం"
- మన్సుఖ్ మాండవియా ట్వీట్
తొలుత.. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ఏప్రిల్ 18న నిర్వహించాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది.
సెప్టెంబర్ 12న నీట్ యూజీ
ఆగస్టు 1న జరగాల్సిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జులై 13 సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. అర్హులైన విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కొవిడ్ నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తునట్లు ధర్మేంద్ర పేర్కొన్నారు.
ఇదీ చదవండి:జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు ఎప్పుడు?