NEET PG Medical Counselling 2023: నీట్ (NEET 2023) పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్‌కు సీట్ల ఎంపికలో ఎంసీసీ (మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రౌండ్లో సీట్లను భర్తీ చేసేందుకు విద్యార్థుల అర్హత మార్కులను సున్నా (0)గా పేర్కొంది. ఈ తగ్గింపు అన్ని కేటగిరీలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇదివరకటి కటాఫ్ మార్కులను.. సున్నాకు తగ్గించిన నేపథ్యంలో మూడో రౌండ్లో సీట్ల కోసం విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counseling Committee) వెల్లడించింది.
NEET PG Medical Counselling 3rd Round 2023 : ఈ క్రమంలోనే పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్లో సీట్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఎంసీసీ పేర్కొంది. ఆప్షన్లను మాత్రం మార్చుకునే అవకాశం కల్పించినట్లు తెలిపింది. కటాఫ్ మార్కులను తొలగించిన కారణంగానే మూడో రౌండ్లో సీట్ల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించామని స్పష్టం చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు అర్హత పరీక్షల మార్కులను '0'కు తగ్గించామని వివరించింది.
NTA Exam Calendar 2024 : ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్ రిలీజ్.. JEE, నీట్ ఎప్పుడంటే..
NEET PG Medical Counselling 3rd Round Cut Off Marks : ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్ పీజీ కౌన్సెలింగ్ (NEET PG Counselling 2023)కు కటాఫ్ మార్కులను 291గా, దివ్యాంగులకు 274, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 257గా పేర్కొని మొదటి రెండు రౌండ్లలో కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేశారు. తాజాగా మూడో రౌండ్లో అన్ని కేటగిరీల్లో సున్నా మార్కులు (విద్యార్థులు నీట్ పీజీ పరీక్షకు హాజరై ఉంటే చాలు) పొందినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లుగా నిబంధనలు మార్చారు.