NEET PG Exam: నీట్ పీజీ ప్రవేశ పరీక్ష మే 21న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల బోర్డు శుక్రవారం తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ఈ పరీక్ష జరగాలి. అయితే నీట్ 2021 కౌన్సెలింగ్ ఇదే సమయంలో ఉన్నందున.. పీజీ పరీక్షను 6-8 వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారమే పరీక్షల బోర్డును కోరింది. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది.
చివరి తేదీ పొడిగింపు
ఆన్లైన్లోనే నీట్ పరీక్ష దరఖాస్తూ సమర్పించేందుకు ఈనెల 4 వరకు ఉన్న గడువు కూడా మార్చి 25 వరకు పెంచారు. నీట్ పీజీ పరీక్ష మే నాటికి వాయిదా వేయడం వల్ల ప్రస్తుతం ఇంటర్న్షిప్ చేస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా ఆ పరీక్షకు హాజరయ్యే అవకాశం వచ్చిందని వైద్య విద్య అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బీ శ్రీనివాస్ చెప్పారు.