వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అభ్యర్థులకు బదులుగా పరీక్ష రాసేందుకు ఇతరులకు సెంటర్లలోకి అనుమతించేందుకు యత్నించినట్లు సీబీఐకి సమాచారం అందింది. ఈ ఆరోపణలపై 8 మందిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిలో ప్రధాన సూత్రధారి కూడా ఉన్నట్లు తెలిసింది.
నీట్ పరీక్షలో 'అక్రమాలు'.. రంగంలోకి సీబీఐ.. 8 మంది అరెస్ట్ - నీట్ పరీక్ష సీబీఐ 2022
వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షలో 'అక్రమాలకు' యత్నించిన 8 మందిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిలో ప్రధాన సూత్రధారి కూడా ఉన్నట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే?
అసలేం జరిగిందంటే?.. దిల్లీ, హరియాణాలో ఆదివారం జరిగిన నీట్ పరీక్షలో నకీలీ అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించడానికి యత్నించినట్లు సీబీఐకు సమాచారం అందింది. భారీ మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేశారని సీబీఐకు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నీట్ పరీక్షలు రాసే విద్యార్థుల పరీక్ష ఐడీ, పాస్‌వర్డ్‌ల వివరాలు సేకరించి ఎవ్వరికీ అనుమానం రాకుండా అభ్యర్థుల ఫొటోలు, వారి స్థానంలో పరీక్షలు రాసే నకిలీ అభ్యర్థుల ఫొటోలను మార్ఫింగ్ చేసి మరీ మోసానికి పాల్పడేందుకు యత్నించారని సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆరోపించింది.
ఇదీ చదవండి:నీట్ పరీక్షలో విద్యార్థినులకు ఇబ్బందులు.. లోదుస్తులు తీసేస్తేనే ఎంట్రీ!