12వ తరగతిలో 93.6 శాతం ఉత్తీర్ణతతో టాపర్గా నిలిచిన ఓ విద్యార్థిని.. నీట్ పరీక్ష బాగా రాయలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని అరియాలుర్ జిల్లా చాతంబడి గ్రామంలో సోమవారం జరిగింది.
ఆదివారం నాడు నీట్ పరీక్ష (NEET 2021) రాసిన కనిమొళి.. తాను పరీక్ష బాగా రాయలేదని తండ్రితో చెప్పింది. డాక్టర్ కావాలన్న తన కల నెరవేరదని మనస్తాపం చెందిన ఆ బాలిక.. సోమవారం నాడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఈ విద్యార్థిని కొన్ని నెలల క్రితం విడుదలైన 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో 93.6 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.