తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోంవర్క్​ చేయలేదా? వేప రసం తాగడమే శిక్ష! వేరే తప్పులు చేస్తే.. - సూరత్​ న్యూస్​

విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరం. చిన్నప్పటి నుంచే సక్రమంగా మెలిగితే జీవితం బాగుపడుతుందని పెద్దలు చెబుతుంటారు. అదే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు విభిన్నంగా.. క్రమశిక్షణ అలవడేలా చేస్తుంది. స్టూడెంట్స్​ కూడా ఈ విధానాన్ని ఇష్టపడుతున్నారు. ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడుంది? ఏం చేస్తుంది?

Neem juice as punishment
Neem juice as punishment

By

Published : Apr 13, 2022, 7:42 PM IST

Updated : Apr 13, 2022, 8:20 PM IST

Neem Juice Punishment: పాఠశాలల్లో విద్యార్థులు చిన్నచిన్న తప్పులు చేసినా, హోంవర్క్​ చేయకపోయినా.. చాలా చోట్ల అధ్యాపకులు కఠిన శిక్షలు విధిస్తుంటారు. బెత్తంతో కొట్టడం, గోడ కుర్చీ వేయించడం, ఎండలో నిలబెట్టడం.. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. కానీ ఆ పాఠశాల మాత్రం ప్రత్యేకం. విద్యార్థులు యూనిఫాం ధరించకపోవడం, హోంవర్క్​ చేయకపోవడం సహా ఇతర తప్పులు చేస్తే ఉపాధ్యాయులు దండించడం వంటివి చేయరు. గుజరాత్​ సూరత్​లోని విద్యాకుంజ్​ పాఠశాల.. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించింది.

విద్యార్థులు తప్పులు చేస్తే వేపరసం తాగిస్తారు. అవును వేపరసం తాగడమే వారికి శిక్ష. ఇలా చేస్తే పిల్లలకు క్రమశిక్షణ అలవడుతుందని చెబుతున్నారు స్కూల్​ డైరెక్టర్​ మహేశ్​ పటేల్​. శారీరక దండన కంటే ఈ పద్ధతితో వారి ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటున్నారు. గాంధేయ సిద్ధాంతాలతో.. ఈ పాఠశాల నడుస్తుందని, సంస్కరణాత్మక చర్యలతో విద్యార్థులకు విలువలు పెంపొందించడమే తమ ధ్యేయమని ఈటీవీ భారత్​తో వెల్లడించారు.

విద్యార్థులకు స్వయంగా వేపరసం అందిస్తున్న పాఠశాల డైరెక్టర్​

''సక్రమంగా స్కూల్​ నడిపి, ధనం ఆర్జించాలనే మేం నమ్ముతాం. అదే సమయంలో విద్యార్థుల్లో మంచి విలువలు పెంపొందించాలి. శిక్షలు విధించాల్సి వస్తే.. వేపరసం తాగించడమే మేలని నా అభిప్రాయం. ఇది ఆరోగ్యానికి మంచిది. మరోసారి తప్పులు చేయాలన్నా ఇది గుర్తొస్తుంది.''

- మహేశ్​ పటేల్​, పాఠశాల డైరెక్టర్​

విద్యార్థుల క్రమశిక్షణకు సంబంధించి గతంలో జరిగిన ఓ విషయాన్ని కూడా ఈటీవీ భారత్​కు వివరించారు పటేల్​. ''ఓసారి టాయిలెట్​ పైప్​లైన్​ ఎవరో పగలకొట్టారు. ఇది ఎవరు చేశారని నేను విద్యార్థులను అడిగా. అంతా మాకు తెలియదు అన్నారు. దీనికి నేను కూడా ఓ కారణం అని భావించి.. తర్వాతి 15 రోజులు చెప్పులు ధరించడం మానేశా. దీంతో తప్పు చేసిన విద్యార్థులు ముందుకు వచ్చారు.'' అని పటేల్​ అన్నారు. స్కూల్​ యాజమాన్యం విధానాలతో తమకేమీ అభ్యంతరం లేదని చెబుతున్నారు విద్యార్థులు. ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఇవో మంచి గుణపాఠాలని వివరిస్తున్నారు.

వేపరసం తాగుతున్న విద్యార్థిని

ఇవీ చూడండి:విద్యుత్​ శాఖ నిర్లక్ష్యం- యువకుడు ఆత్మహత్య!

మామిడి పండ్లు కిలో రూ.2.70లక్షలు- సెక్యూరిటీ కోసం 15 సూపర్ డాగ్స్​!

Last Updated : Apr 13, 2022, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details