దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. పలు రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా 2.0 కట్టడికి సత్వర, నిర్ణయాత్మక చర్యలు అవసరమని సీఎంలకు స్ఫష్టం చేశారు.
మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని మోదీ తెలిపారు. దేశంలోని 70 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 150 శాతం పెరిగిందని వెల్లడించారు. వైరస్‌ను ఇప్పుడే కట్టడి చేయకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ విజృంభించే ప్రమాదముందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
" కరోనాపై పోరాటంలో సాధించిన విశ్వాసం నిర్లక్ష్యానికి దారి తీయరాదు. అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. పరీక్షల సంఖ్యను పెంచాలి. కరోనా టీకా పంపిణీ కేంద్రాలను పెంచాలి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దు. సమస్యల నుంచి కాపాడతామనే భరోసాను వారికి ప్రభుత్వాలు కల్పించాలి. టెస్ట్, ట్రాక్, ట్రీట్‌ను మునుపటిలా తీవ్రంగా పరిగణించాలి. మొత్తం కరోనా టెస్టుల్లో 70శాతానికిపై ఆర్టీ పీసీఆర్ పరీక్షలే ఉండాలి. ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, ఒడిశా యాంటీజెన్ పరీక్షలపైనే అధికంగా ఆధారపడి ఉన్నాయి."
-ప్రధాని నరేంద్ర మోదీ
వృథా కానివ్వద్దు..