భారతదేశంలోని వయోజనుల్లో 80 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు డోసులూ తీసుకున్న వారి సంఖ్య 38 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అజ్ఞాని పేర్కొన్నారు. నవంబర్ 30 నాటికి దేశంలో మొదటి డోస్ టీకా తీసుకున్న వారి సంఖ్య 90 శాతానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కేరళలో స్వల్పంగా తగ్గిన కేసులు..
కేరళలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 6,674 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 59 మంది కొవిడ్‌తో చనిపోయారు.
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 62 మందిలో వైరస్ నిర్ధరణ అయింది. మరో ఇద్దరు కరోనా కారణంగా చనిపోయారు.