తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికాకు వెళ్తున్న విద్యార్థుల్లో 20శాతం భారతీయులే! - అమెరికా ఓపెన్​ డోర్స్ నివేదిక

2019-20 విద్యా సంవత్సరంలో 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు.. ఉన్నత విద్యకు అమెరికాను ఎంపిక చేసుకున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు 10 లక్షల మంది విద్యార్థులు రాగా.. అందులో 20 శాతం భారతీయులేనని నివేదిక వివరించింది.

Indian students chose US for higher studies
విదేశీ విద్యకు అమెరికానే విద్యార్థుల ఎంపిక

By

Published : Nov 16, 2020, 6:20 PM IST

విదేశాల్లో ఉన్నత విద్యకు భారత విద్యార్థుల్లో ఇటీవల ఆసక్తి పెరుగుతోంది. అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన ఓపెన్​ డోర్స్​ నివేదికలోనూ ఇదే విషయం వెల్లడైంది.

2019-20 విద్యా సంవత్సరంలో ఉన్నత చదువుల కోసం దాదాపు రెండు లక్షల మంది అమెరికాను ఎంచుకున్నట్లు నివేదిక వివరించింది.

ప్రపంచ దేశాల నుంచి వచ్చిన 10 లక్షల మంది విద్యార్థుల్లో 20శాతం మంది భారతీయలే ఉన్నట్లు పేర్కొన్న నివేదిక.. భారత్​ నుంచి అండర్​ గ్రాడ్యుయేట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వివరించింది.

గత పదేళ్లలో భారతీయ విద్యార్థుల సంఖ్య అమెరికాలో దాదాపు రెట్టింపు అయినట్లు పబ్లిక్ ఎఫైర్స్ మినిస్టర్ కౌన్సిలర్​ డేవిడ్ కెనెడీ అన్నారు.

భారత్​ నుంచి అమెరికాలో విద్య కోసం వెళ్లాలనుకునే విద్యార్థులకు సహాయం చేసేందుకు.. భారత్​లో ఏడు ఎడ్యుకేషనల్ అడ్వైసింగ్ సెంటర్లను నిర్వహిస్తోంది అమెరికా. దిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్​కతా, ముంబయి, అహ్మదాబాద్​లో అవి ఉన్నాయి. వచ్చే ఏడాది తొలినాళ్లలో హైదరాబాద్​లో రెండో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది అమెరికా.

ఇదీ చూడండి:'స్టాట్యూ ఆఫ్​ పీస్​' విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

ABOUT THE AUTHOR

...view details