తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్కరోజే 14 లక్షల మందికి టీకా - కేంద్ర ఆరోగ్య శాఖ

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విస్తృతంగా సాగుతోంది. ఈ క్రమంలో గురువారం ఒక్కరోజే సుమారు 14 లక్షల మందికి టీకా అందించారు. ఇప్పటివరకు దేశంలో 1.8 కోట్ల మందికి వ్యాక్సిన్​ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

vaccine
ఒక్కరోజే 14 లక్షల మందికి టీకా

By

Published : Mar 5, 2021, 9:46 PM IST

దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ చురుగ్గా సాగుతున్న వేళ గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో సుమారు 14 లక్షల మందికి టీకాను అందజేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జనవరి 16న మొదటి దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభించినప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత మందికి టీకా అందించడం ఇదే తొలిసారి అని ప్రకటించింది.

ఇప్పటివరకు దేశంలో 1.8 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. ఇందులో 68.53లక్షల మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లు, 60.90 లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా తొలి డోసు ఇచ్చినట్లు పేర్కొంది. రెండో దశలో 31.41 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు రెండో డోస్‌ అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. 45 ఏళ్లు దాటి తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారిలో 2లక్షల 35వేల9వందల మందికి, 60 ఏళ్లు దాటిన 16లక్షల16వేల 9వందల 20 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆగస్టు నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి :'నేతలంతా డబ్బులిచ్చి టీకా వేయించుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details