తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid in India: భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 30 వేలు - vaccination india

దేశంలో కొత్తగా 30 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 374 మంది మరణించారు. సోమవారం 52,67,309 మందికి టీకా అందించారు.

covid in india
కరోనా కేసులు

By

Published : Jul 20, 2021, 9:31 AM IST

Updated : Jul 20, 2021, 11:35 AM IST

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. క్రితం రోజుతో పోలిస్తే 8 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. కొత్తగా 30,093‬ మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 374 మంది చనిపోయారు.

  • మొత్తం కేసులు: 3,11,74,322‬
  • మొత్తం మరణాలు: 4,14,482
  • కోలుకున్నవారు: 3,03,53,710
  • యాక్టివ్ కేసులు: 4,06,130

టెస్టింగ్

దేశవ్యాప్తంగా సోమవారం 17,92,336పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం నిర్వహించిన పరీక్షల సంఖ్య 44,73,41,133కి చేరినట్లు తెలిపింది.

టీకా పంపిణీ

సోమవారం 52,67,309 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా 41,18,46,401 డోసులను పంపిణీ చేసినట్లు స్పష్టం చేసింది.

ప్రపంచంలో..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ ప్రమాదకరంగానే కొనసాగుతోంది. కొత్తగా 4.18 లక్షల కేసులు బయటపడ్డాయి. మరో 6,840 మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 19 కోట్ల 16 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 41 లక్షల 12 వేలు దాటింది.

పలు దేశాల్లో కొత్త కేసులు ఇలా..

  • బ్రిటన్: 39,950
  • ఇండోనేసియా: 34,257
  • ఇరాన్: 25,441
  • రష్యా: 24,633
  • అమెరికా: 24,266

ఇదీ చదవండి:టీకా కోసం ఎగబడ్డ జనం.. ఎక్కడంటే?

Last Updated : Jul 20, 2021, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details