తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NDAకు మోదీ కొత్త నిర్వచనం.. దిల్లీ సమావేశానికి 38 పార్టీల నేతలు హాజరు - ఎన్‌డీఏ జులై 18

nda meet live updates
దిల్లీ ఎన్‌డీఏ మీటింగ్​

By

Published : Jul 18, 2023, 5:13 PM IST

Updated : Jul 18, 2023, 9:14 PM IST

21:02 July 18

  • 1990లో దేశంలో అస్థిరత దిశగా కూటమి ఏర్పాటు జరిగింది: ప్రధాని
  • కాంగ్రెస్‌.. ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది.. ప్రభుత్వాలు కూల్చింది: ప్రధాని
  • 1998లో ఎన్డీఏ ఏర్పాటు జరిగింది: ప్రధాని మోదీ
  • కేవలం ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో ఎన్డీఏ ఏర్పాటు కాలేదు: ప్రధాని
  • మరొకరికి శత్రువుగా ఉండేందుకు ఎన్డీఏ ఏర్పాటు కాలేదు: ప్రధాని
  • ఎన్డీఏ ఏర్పాటులో వాజ్‌పేయీ, అడ్వాణీ కీలక భూమిక పోషించారు: ప్రధాని
  • మరో ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎన్డీఏ ఏర్పాటు కాలేదు: ప్రధాని
  • దేశంలో స్థిరత్వం తీసుకువచ్చేందుకు ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది: ప్రధాని
  • దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే దేశ ప్రగతి మార్చగలదు: ప్రధాని
  • స్థిర ప్రభుత్వం వల్లే ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగింది: ప్రధాని
  • ఎన్డీఏ ప్రతిపక్షంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయాలు చేసింది: ప్రధాని
  • ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేశాం: ప్రధాని

20:46 July 18

  • మిత్రపక్షాలు వివిధ రకాలుగా ఎన్డీఏకు మద్దతిచ్చాయి: ప్రధాని మోదీ
  • ఎన్డీఏ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయింది: ప్రధాని మోదీ
  • దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ కీలక భూమిక పోషించింది: ప్రధాని
  • ఎన్డీఏ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది: ప్రధాని మోదీ
  • రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశ అభివృద్ధి సాధ్యం: ప్రధాని
  • ఈ నినాదంతోనే ఎన్డీఏ నిరంతరం ముందుకు సాగింది: ప్రధాని
  • ఎన్డీఏతో కలిసి వచ్చిన ప్రతి పార్టీకి అభినందనలు: ప్రధాని
  • భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నా: ప్రధాని
  • వచ్చే 25 ఏళ్ల ప్రణాళికతో ప్రగతి కార్యాచరణ రూపకల్పన: ప్రధాని
  • ఆత్మనిర్భర్‌, భారత్‌ పురోభివృద్ధి లక్ష్య సాకారానికి కృషి: ప్రధాని
  • భారతీయులు కొత్త సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు: ప్రధాని
  • కొత్త సంకల్పం సాకారానికి ఎన్డీఏ కీలక భూమిక పోషిస్తుంది: ప్రధాని
  • ఎన్‌డీఏకు కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రధాని మోదీ
  • ఎన్‌-న్యూ ఇండియా, డీ-డెవలప్‌ నేషన్‌, ఏ-యాస్పిరేషన్‌ ఆఫ్‌ పీపుల్‌
  • దేశంలోని అన్ని వర్గాలకు ఎన్డీఏపై పూర్తి నమ్మకం ఉంది: ప్రధాని
  • అందరి కృషి వల్లే దేశం అభివృద్ధి పథంలో సాగుతుంది: ప్రధాని
  • దేశ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి: ప్రధాని
  • దేశ ప్రజలందరి భావనలను ఎన్డీఏ ముందుకు తీసుకెళ్తుంది: ప్రధాని



17:23 July 18

ఎన్​డీఏ సమావేశం ప్రారంభం..

బీజేపీ అధ్యర్యంలో దిల్లీలోని అశోక్​ హోటల్​లో​ ఎన్​డీఏ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్​డీఏ భాగస్వామ్య ప్రార్టీల ప్రతినిధులు, పలువులు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మోదీకి గజమాలతో సత్కారం అనంతరం ఈ సమావేశం ప్రారంభమైంది. 2024 లోక్​సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమైన 'INDIA'ను ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహాన్ని ఎన్​డీఏ రూపొందించనుంది.

16:40 July 18

దిల్లీలో NDA సమావేశం​.. మోదీ సహా 38 పార్టీల నేతలు హాజరు

NDA Meet Live Updates : దిల్లీ వేదికగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్​డీఏ) సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. బీజేపీ అధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీలతో పాటు కొత్త భాగస్వామ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశం ద్వారా 2024 ఎన్నికల ప్రచారాన్ని కమలదళం ప్రారంభించనుంది. ఈ సమావేశానికి 38 పార్టీల నేతలు హాజరుకానున్నారు. జాతీయ పురోగతిని, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ కూటమి ప్రయత్నిస్తోందని ఎన్‌డీఏ సమావేశానికి ముందు ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు.

Last Updated : Jul 18, 2023, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details